Sunday, December 22, 2024

మద్యం కుంభకోణంలో మధ్యవర్తి కేజ్రీవాలే!.. కోర్టులో ఈడీ వాదన

- Advertisement -
- Advertisement -

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ది కీలకపాత్ర అని ఈడీ కోర్టులో వాదనలు వినిపించింది. నిందితులకూ, సౌత్ గ్రూపునకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని, ఈ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి ఆయనేనని ఇడి తరఫున న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. కేజ్రీవాల్ ను శుక్రవారంనాడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఎక్సైజ్ పాలసీ రూపకల్పన చేసినందుకు, దాన్ని అమలు చేసినందుకు ప్రతిఫలంగా ఆయన కోట్ల రూపాయలు లంచంగా అందుకున్నారని ఈడి ఆరోపించింది. సౌత్ గ్రూపునుంచి సుమారు రూ.100 కోట్లు ముడుపులుగా అందుకుని, అందులో కొంత డబ్బును గోవాలో ఎన్నికల కోసం ఖర్చు చేశారని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News