అమరావతి: విజయవాడ ఎసిబి కోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై వాదనలు జరిగాయి. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరుఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బృందం వాదనలు వినిపించారు. సిఐడి తరఫున అదనపు ఎజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి బృందం వాదనలు వినిపించింది. స్కిల్ స్కామ్ రాజకీయ ప్రేరేపితమైందని సిద్ధార్థ లూద్రా పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు ఎందుకు చేర్చలేదని కోర్టు అడిగిందన్నారు.
Also Read: పెంపుడు మేకకూ రైలు టిక్కెట్..ఆ గామీణ మహిళ నిజాయితీకి వందనం(వైరల్ వీడియో)
రిమాండ్ రిపోర్టులో అన్ని అంశాలు చేర్చామని అదనపు ఎజి పేర్కొన్నారు. 2021లో కేసు పెడితే ఇప్పటివరకూ ఎందుకు చంద్రబాబును అరెస్టు చేయలేదని కోర్టు ప్రశ్నించిందని, 409 సెక్షన్‌పై ఎసిబి కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. దీంతో చంద్రబాబు హక్కులకు భంగం కలిగేలా సిఐడి వ్యవహరించిందని లూథ్రా చెప్పారు. శుక్రవారం ఉదయం 10 నుంచి సిఐడి అధికారుల ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాలని కోరిందని లూథ్రా వివరించారు. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి కావాలని, గవర్నర్ అనుమతిని సిఐడి తీసుకోలేదని మండిపడ్డారు.