ముంబై: సుప్రసిద్ధ డిటర్జెంట్ బ్రాండ్ ఏరియల్ 2015 సంవత్సరం నుంచి కూడా అర్థవంతమైన సంభాషణలను జరుపుతూనే, మగవారికి భారం పంచుకోవాల్సిందిగా కోరుతూ షేర్ ద లోడ్ అంటూ ప్రచారమూ చేస్తుంది. ఈ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంతో పాటుగా ఇంటి పనులు సమానంగా పంచుకోవాలంటూ ఇటీవలనే సీ ద సైన్స్, షేర్ ద లోడ్ అంటూ ప్రచార చిత్రాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ ప్రచారం ద్వారా సుదీర్ఘకాలం పాటు ఇంటిలో భారం పంచుకోకపోతే , అది బంధాలపై చూపే ప్రభావాన్ని తెలుపడంతో పాటుగా మగవారిని భారం పంచుకోమని అభ్యర్ధిస్తుంది.
ఈ ప్రచార చిత్రం గురించి పీ అండ్‌జీ ఇండియన్ సబ్‌కాంటినెంట్, వైస్ ప్రెసిడెంట్– ఫ్యాబ్రిక్ కేర్, పీ అండ్ జీ ఇండియా ాఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శరత్ వర్మ మాట్లాడుతూ ‘‘ఈ సంవత్సరపు ప్రచారాన్ని మా అధ్యయనాల ఆధారంగా తీర్చిదిద్దాము. దాదాపు 81% మంది మహిళలు ఇంటి పనుల భారం తమ బంధంపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా తమ బంధం దూరం కావడానికీ అది ఒక కారణంగా వెల్లడిస్తున్నారు. మా అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం ఇంటి పనులు కలిసి చేస్తే బంధం బలపడుతుందని 95% జంటలు భావిస్తున్నాయి’’ అని అన్నారు.
బీబీడీఓ ఇండియా ాఫ్ క్రియేటివ్ ఆఫీసర్, ఛైర్మన్ జోసీపౌల్ మాట్లాడుతూ ‘‘ఈ తాజా ఎడిషన్ షేర్ ద లోడ్ ప్రచారం, పెళ్లైన జంటలకు కనువిప్పుగా ఉంటుంది. ఇంటి పనుల విభజన సమానంగా జరగక పోవడం వల్ల మానసికంగా బంధానికి చాలా జంటలు దూరమవుతున్నాయి. ఈ సీ ద సైన్స్, షేర్ ద లోడ్ ప్రచారం ద్వారా వాటిని ఎత్తి చూపుతూ, భారం పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము’’ అని అన్నారు.