Monday, April 7, 2025

ఐక్యరాజ్యసమితి శాశ్వత ప్రతినిధిగా అరిందమ్ బాగ్చి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చిని జెనీవా లోని ఐక్యరాజ్య సమితి , ఇతర అంతర్జాతీయ సంస్థలకు భారత దేశపు కొత్త శాశ్వత ప్రతినిధిగా కేంద్రం నియమించింది. ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) 1995 బ్యాచ్‌కు చెందిన అరిందమ్ బాగ్చినియామకంపై కేంద్ర విదేశాంగశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అరిందమ్ 2021లో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జి 20 సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వడం, భాగస్వామ్య దేశాల్లో భారత్ పాత్ర మరింత ప్రాధాన్యం సంతరించుకోవడంతో ఆయనను యూఎన్ శాశ్వత ప్రతినిధిగా నియమించాలని కేంద్రం నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News