Monday, December 23, 2024

అర్జున్, జెడి చక్రవర్తి పోటీపడుతూ నటించిన సినిమా

- Advertisement -
- Advertisement -

యాక్షన్ కింగ్ అర్జున్, జెడి చక్రవర్తి కాంబినేషన్‌లో డి. ఎస్.రెడ్డి సమర్పణలో ఎఫ్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మహమ్మద్ ఫర్హీన్ ఫాతిమ నిర్మాతగా ఎస్‌ఎస్ సమీర్ దర్శకత్వంలో వస్తున్న సిని మా ఇద్దరు. ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ప్రెస్ మీట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రతాని రామకృష్ణ గౌడ్, టి. ప్రసన్నకుమార్, జెవిఆర్ పాల్గొన్నారు. ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత డిఎస్ రెడ్డి మాట్లాడుతూ “ఇది ఎక్కడ రాజీపడకుండా మంచి క్వాలిటీతో తీసిన సినిమా. ప్రేక్షకులందరూ ఈ సినిమా చూసి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను”అని అన్నారు. నిర్మాత, దర్శకుడు సమీర్ మాట్లాడుతూ “ఈ సినిమాలో అర్జున్, చక్రవర్తి పోటీ పడుతూ నటించారు. హీరోయిన్స్‌గా రాధిక కుమారస్వామి, సోనీ ఇద్దరూ చాలా బాగా నటించారు. కళాతపస్వి కె. విశ్వనాథ్‌కి ఇది చివరి సిని మా. అంతేకాకుండా ఒక పాటలో స్టెప్స్ కూడా వేశారు. అమీర్ ఖాన్ తమ్ము డు ఫైజల్ ఖాన్ కూడా ఈ సినిమాలో నటించారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సోని చరిష్టతో పాటు చిత్ర బృందం పాల్గొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News