Monday, December 23, 2024

క్రైమ్, కామెడీ ఎంటర్‌టైనర్ !

- Advertisement -
- Advertisement -

శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా భాగ్ సాలే. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాతగా.. బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. ఈనెల 7న భాగ్ సాలే సినిమాను విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత అర్జున్ దాస్యన్ మీడియాతో మాట్లాడుతూ “డైరెక్టర్ కథ అనుకున్నప్పుడే హీరోగా శ్రీసింహాను అనుకున్నారు.

Also Read:  వైద్య రంగంలో తెలంగాణ మరో మైలురాయి..

సంగీత దర్శకుడిగా కాల భైరవ ఉండాలని ముందే అనుకున్నాం. సినిమాలో హీరో పేరు అర్జున్. సులభంగా ఎదగాలనే అనుకునే కుర్రాడు. ఈ క్రమంలో మోసాలు చేయడం.. ఎదురయ్యే సమస్యలపై హీరో పాత్ర ఉంటుంది. ఓ రింగ్ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. మొత్తం సినిమా ఈ రింగ్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా కల్పితమే. సినిమాలో క్రైమ్, కామెడీ రెండు సమానంగా ఉంటాయి. మంచిగా నవ్వుకుంటూనే సినిమా సాగుతుంది. జాన్ విజయ్ విలన్‌గా నటించారు”అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News