Thursday, January 23, 2025

కిరణ్ రిజిజు స్థానంలో న్యాయ శాఖ మంత్రిగా అర్జున్ మేఘావల్

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: కేంద్ర న్యాయ శాఖ(ఇండిపెండెంట్ చార్జ్) మంత్రిగా బికనేర్ ఎంపి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రాం మేఘావల్ గురువారం నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ శాఖను చూసిన కిరణ్ రిజిజు ఎర్త్ సైన్సెస్ శాఖకు మారారు. ప్రధాన మంత్రి సిఫార్సు మేరకు క్యాబినెట్‌లో మంత్రులకు రాష్ట్రపతి శాఖలను కేటాయించినట్లు రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కిరణ్ రిజిజుకు ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖను కేటాయించినట్లు రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉన్న అర్జున్ రాం మేఘావల్‌కు అదనంగా న్యాయ శాఖను స్వతంత్ర ప్రతిపత్తిలో కేటాయించనట్లు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News