- Advertisement -
నందమూరి కళ్యాణ్ రామ్ గత కొంతకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఆయన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి కళ్యాణ్‌కు తల్లిగా నటిస్తున్నారు. సోమవారం ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. విజయశాంతి ఫైట్‌తో ప్రారంభమయ్యే ఈ టీజర్ ప్రేక్షఖుకు ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో తల్లి, కొడుకు మధ్య ఉండే ప్రేమ. భావోద్వేగాలను చూపిస్తారని టీజర్ చూస్తే అర్థమవుతోంది. సోహైల్ ఖాన్, సయూ మంజ్రేకర్, శ్రీకాంత్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. . అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.
- Advertisement -