- Advertisement -
నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్- ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ నయాల్ది సాంగ్‌ని మార్చి 31న రిలీజ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ స్టన్నింగ్ క్లాస్ లుక్‌లో, ఉర్రూతలూగించే మాస్ డ్యాన్స్ చేస్తూ కనిపించిన పోస్టర్ అదిరిపోయింది. ఈ సినిమా కోసం అజనీష్ లోక్‌నాథ్ బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
- Advertisement -