Wednesday, April 2, 2025

పల్నాటి పౌరుషం మొత్తం కళ్యాణ్ రామ్ పాత్రలో..

- Advertisement -
- Advertisement -

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్ -ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఈ వేసవి సీజన్‌లో బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్‌లలో ఒకటిగా విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా టీజర్ భారీ అంచనాలను నెలకొల్పింది. టీజర్ తోనే సినిమా థియేటర్, నాన్ ధియేటర్ బిజినెస్ మొత్తం క్లోజ్ అయ్యింది. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాగా ఈ మూవీ రికార్డు సృష్టించింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రంలో విజయశాంతి ఐపిఎస్ అధికారిగా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా సాంగ్ లాంచ్ వేడుక నరసరావుపేటలోని రవి కళా మందిర్‌లో భారీగా తరలివచ్చి ఫ్యాన్స్ సమక్షంలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా అభిమానులు భారీ ర్యాలీని నిర్వహించారు.

నాయల్ది సాంగ్ కళ్యాణ్ రామ్, సాయి మంజ్రేకర్ మధ్య సిజలింగ్ కెమిస్ట్రీని చూపించింది. అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచిన ఈ ట్రాక్, రఘురామ్ రాసిన లిరిక్స్ తో సాయి అందం పట్ల కళ్యాణ్ రామ్ అభిమానాన్ని ఆకట్టుకునే శైలిలో అందంగా చిత్రీకరించారు. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ “ఈ సినిమాలో మా అమ్మ పాత్ర చేసిన విజయశాంతి ఆ క్యారెక్టర్‌ని ఒప్పుకోవడం వల్లే ఈ సినిమా చేయడం జరిగింది. అమ్మలని గౌరవించడం మన బాధ్యత. ఈ సినిమాని అమ్మలందరికీ అంకితం చేస్తున్నాం”అని అన్నారు. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి మాట్లాడుతూ “నందమూరి అభిమానులు కళ్యాణ్ రామ్‌ని ఎలా చూడాలని కోరుకుంటారో ఈ సినిమాలో అలా ఉంటారు. పల్నాటి పౌరుషం మొత్తం ఈ క్యారెక్టర్‌లో ఉంటుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అశోక్ వర్ధన్ ముప్ప, చదలవాడ ఆదిత్య బాబు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News