నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఎన్‌కెఆర్21’లో విజయశాంతి ఐపిఎస్ ఆఫీసర్‌గా పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మేకర్స్ మూవీ టైటిల్‌ను ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’గా తెలియజేస్తూ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ కళ్యాణ్ రామ్, విజయశాంతి పాత్రలని ఇంటెన్స్ డైనమిక్‌గా చూపిస్తోంది. మండుతున్న జ్వాలల మధ్య వారు దృఢ సంకల్పంతో నడుస్తున్నట్లు కనిపిస్తున్నారు. కళ్యాణ్ రామ్ పవర్‌ఫుల్‌గా, విజయశాంతి ఖాకీ దుస్తులలో కనిపించారు. టైటిల్, ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్. సోహైల్ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్‌ను సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ అందించగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు. సినిమా ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. మిగిలిన పార్ట్‌లు పూర్తయ్యాక, రిలీజ్ డేట్‌ని ప్రకటించడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు.