Thursday, January 23, 2025

ప్రపంచకప్ షూటింగ్: అర్జున్‌కు స్వర్ణం..

- Advertisement -
- Advertisement -

Arjun Win Gold in World Cup Shooting

చాంగ్‌వాన్: కొరియా వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ షూటింగ్‌లో భారత షూటర్ అర్జున్ బబుటా స్వర్ణం సాధించాడు. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫీల్ ఫైనల్లో అర్జున్ విజయం జయకేతనం ఎగుర వేశాడు. సమీప ప్రత్యర్థి లుకాస్ కొజెనెస్కి (అమెరికా)ను వెనక్కినెట్టి అర్జున్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో అసాధారణ ప్రతిభను కనబరిచిన అర్జున్ 261.1 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక క్వాలిఫయింగ్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన లుకాస్ ఫైనల్లో మాత్రం వెనుకబడి పోయాడు. అతను 260.4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకున్నాడు. ఇక ఇజ్రాయిల్ షూటర్ సెర్గి రిచ్టర్‌కు కాంస్యం దక్కింది. కాగా, భారత్‌కు చెందిన పార్థ్ మఖిజా నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో పార్థ్ కొద్ది తేడాతో కాంస్యం సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

Arjun Win Gold in World Cup Shooting

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News