హైదరాబాద్ : అర్జున అవార్డు గ్రహీత, రాష్ట్రానికి చెందిన రోలార్ స్కేటింగ్‌లో వరల్డ్ చాంపియన్ షిప్ అనూప్ యామ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌ను కలిశారు. గురువారం హైదరాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో స్టేట్ ఆఫ్‌ది స్కేట్ తెలంగాణ పేరుతో స్కేటింగ్ అకాడమీ కమ్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేయటానికి రాష్ట్ర క్రీడా శాఖ తరుపున సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు రాష్ట్రంలో స్టేట్ ఆఫ్‌ది స్కేట్ తెలంగాణ పేరుతో స్కేటింగ్ అకాడమీ కమ్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేయటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శాఖ తరపున పూర్తి సహకారం అందిస్తామని మంత్రి వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసే రోలర్ స్కేటింగ్ అకాడమీ ద్వారా రాష్ట్రంలో సుమారు మూడు వేల మంది రోలార్ స్కేటర్స్ ను జాతీయ అంతర్జాతీయ ఆసియా కప్ వరల్డ్ కప్ తో పాటు ఒలంపిక్ స్థాయిలో మెరుగైన క్రీడా శిక్షణ ఇవ్వడానికి అకాడమీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి, తెలంగాణ లారీ అసోసియేషన్ అధ్యక్షులు మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.