Monday, April 14, 2025

‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఏప్రిల్ 18న విడుదల

- Advertisement -
- Advertisement -

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. సెన్సార్ సహా అన్ని లాంఛనాలతో ఈ చిత్రం పూర్తయింది. సెన్సార్ బోర్డ్ సినిమాకి ‘యు/ఎ’ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా 2 గంట ల 24 నిమిషాల రన్ టైమ్‌తో యాక్షన్, ఎమోషన్, థ్రిల్స్‌ను సమపాళ్లలో మిళితం చేస్తుంది. యాక్షన్ సన్నివేశాలు, మనసుని కదిలించే మదర్ అండ్ సన్ డ్రామా.. ప్రతి క్షణం గ్రిప్పిం గ్‌గా ఉంటుందని హామీ ఇస్తుంది. కళ్యాణ్ రామ్ బాధ్యతాయుతమైన కొడుకు పాత్ర, తల్లిగా విజయశాంతి అద్భుతమైన నటన సినిమాపై అంచనాలను పెంచేస్తాయి. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు సినిమాని అత్యున్నతంగా నిర్మించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News