Monday, December 23, 2024

ఆర్మ్ రెజ్లింగ్ పోటీలు షురూ..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తొలి ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్) పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు. ఆగస్టు 13 వరకు ఈ పోటీలు జరుగనున్నాయి. లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. కిరాక్ హైదరాబాద్, ముంబై మసల్స్,లుధియానా లయన్స్, బరోడా బాద్షాస్, రోథక్ రౌడీస్, కోచి కేడిస్ జట్లు ఈ లీగ్‌లో పాల్గొంటున్నాయి.

శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ రికాగ్ ఓటమి పాలైంది. లుధియానా లయన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌కు పరాజయం ఎదురైంది. లుధియానా 21 తేడాతో హైదరాబాద్ కిరాక్ టీమ్‌ను ఓడించింది. మెయిన్ కార్డ్‌లో భాగంగా జరిగిన తొలి పోరులో హైదరాబాద్ ఆటగాడు అస్కల్ అలీ విజయం సాధించాడు. అయితే తర్వాత జరిగిన పోటీల్లో స్టీవ్ థామస్, షోయబ్ అక్తర్‌లు ఓటమి పాలయ్యారు. తర్వాతి మ్యాచ్‌లో బరోడా బాద్షాస్‌తో హైదరాబాద్ తలపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News