Monday, December 23, 2024

నేటి నుంచి ఆర్మ్ రెజ్లింగ్ పోటీలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: తొలి పిఆర్‌ఓ పాన్జా లీగ్ ఆర్మ్ రెజ్లింగ్ పోటీలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జులై 28 నుంచి ఆగస్టు 13 వరకు దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు పోటీ పడనున్నాయి. కిరాక్ హైదరాబాద్, ముంబై మసల్స్, లుధియానా లయన్స్, బరోడా బాద్షాస్, రోథక్ రౌడీస్ ఫ్రాంచైజీలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. ఈ పోటీలను సోనీ స్పోర్ట్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. దేశంలో ఆర్మ్ రెజ్లింగ్ పోటీలకు ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News