Monday, December 23, 2024

గ్రూప్ 1 పరీక్షకు పకడ్బంది ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జూన్ 11న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమినరి పరీక్ష జిల్లాలో సజావుగా జరిగేలా పకడ్బంది ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ ఆడిటోరియంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్షా నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు కలెక్టర్ కర్ణన్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 11 న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు నిర్వహించనున్న గ్రూప్ వన్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా పకడ్బంది ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు.

పరీక్షా కేంద్రాలలో వికలాంగుల కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు సౌకర్యాలను కల్పించాలని, స్ట్రాంగ్ రూం నుంచి పరీక్షా కేంద్రానికి తిరిగి పరీక్షా కేంద్రం నుంచి స్ట్రాంగ్ రూంకు ఎగ్జామ్ మెటిరియల్ తరలించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. 34 కేంద్రాల్లో 16829 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని లైట్లు, ఫ్యాన్లు, తాగునీరు, టాయిలెట్స్ ఉండాలని సూచించారు.

పరీక్షకు ముందుగా మాక్ డ్రిల్ నిర్వ హించాలని, ఎట్టి పరిస్థితుల్లో 10.15 తరువాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అను మతించరాదని ఆదేశించారు. పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వాచ్, సెల్ ఫోన్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరాదని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపును నిర్వ హించాలని, అభ్యర్థులు హల్ టికెట్ తో పాటు ఎదైన ఒరిజినల్ గుర్తింపు కార్డును పాన్ కార్డు మినహ వెంటతీసుకురావాలని సూచించారు. శిక్షణ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, కరీంనగర్ ఆర్డిఓ ఆనంద్ కుమార్, ఏ ఓ జగత్ సింగ్ చీఫ్ సూపరింటెండెంట్లు, లైసన్ అధికారులు,సంబంధిత అధికారుల పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News