Monday, January 20, 2025

22న సిఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యేతో కలిసి సమీక్షించిన కలెక్టర్
  • సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న గూడెం

సంగారెడ్డి: 22న సిఎం కెసిఆర్ సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సిఎం కార్యాలయం నుంచి సమాచారం అందడ ంతో దీనికి తగిన విధంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. తన సత్తాచాటేందుకు ఎమ్మెల్మే మహిపాల్‌రెడ్డి ఇదే అవకాశంగా భావిస్తున్నారు. సోమవారం జిల్లా కలెక్ట ర్ శరత్ పటాన్‌చెరు వెళ్లారు. అక్కడ సిఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో పాటు జిల్లా ఎస్‌పి రమణకుమార్, ఇతర అధికారులతో చర్చించారు. సిఎం కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు తాగునీటిని ఏర్పాటు చేయాలని, ఫస్ట్ ఎయిడ్ సదుపాయం కల్పించాలని, అంబులెన్సులు, అగ్నిమాపక వా హనం, తగిన సిబ్బంది అందుబాటులో ఉండాలని సం బంధిత అధికారును ఆదేశించారు.

పారిశుద్ధ నిర్వహణ సక్రమంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుం డా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారుల ను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు. పర్యటన విజయవంతం గా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఎండలు తీ వ్రంగా ఉన్నందున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూ డాలన్నారు. పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలను ప్రా రంభిస్తారు. అంతే కాకుండా నూతనంగా మరికొన్ని కా ర్యక్రమాలకు సిఎం కెసిఆర్ శ్రీకారం చుడతారు. చాలా రోజుల తర్వాత సిఎం కెసిఆర్ ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నందున స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

తనదైన శైలిలో జన సమీకరణకు ఆయన సిద్ధమవుతున్నారు. తన సత్తాను చాటేందుకు ఆలోచిస్తున్నారు. నియోజకవర్గంలో తానేంటో నిరూపించేందుకు ఇదే అవకాశంగా ఆయన భావిస్తున్నారు. పార్టీలో ప్రత్యర్థులకు, ఇ తర పార్టీల వారికి సవాల్ విసిరే విధంగా మహిపాల్‌రెడ్డి ఏర్పాట్లు చేయబోతున్నారు.భారీ తనం కనిపించే విధంగా ఏర్పాట్లు చేయడమే కాకుండా, వినూత్నంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని చూస్తున్నారు.కలెక్టర్ సమీక్ష లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, డిఎంహెచ్‌ఓ డాక్టర్ గాయత్రి, డిపిఓ సురేష్‌మోహన్,డిఆర్‌డిఓ శ్రీనివాసరావు, ఇతర అధికారులు అరుణ్‌కుమార్, గీత, తహశీల్దార్లు సిఐ వేణుగోపాల్‌రెడ్డిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News