Wednesday, January 22, 2025

గ్రూప్ 4 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ : గ్రూప్ 4 పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం గ్రూప్ 4 పరీక్షల నిర్వహణపై టిఎస్ పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు సూచనలు, మార్గదర్శకాలను నిర్దేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రూప్ 4 పరీక్షలకు జిల్లాలో 18,120 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని, అందుకుగానూ 67 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు 13 రూట్స్ ను గురి ్తంచడం జరిగిందన్నారు. పరీక్షల నిర్వహణపై ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్ లు, లైసెన్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి విధుల నిర్వహణపై తగు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

అనంతరం అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డిఆర్వో అశోక్ కుమార్, డీఈవో రేణుకా దేవి, డిడబ్ల్యుఓ లలిత కుమారి లతో కలిసి గ్రూప్-4పరీక్షల్లో విధులు నిర్వహించే చీఫ్ సూపరింటెండెంట్ లు, లైసెన్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు, అధికారులతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి పరీక్ష కేంద్రాల్లో వివిధ మౌలిక సదుపాయాల కల్పన, విధుల్లో నిర్వహించాల్సిన బాధ్యతలు, అనుసరించాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావునీయకుండా అధికారులందరూ సమన్వయంతో పని చేసి పరీక్ష సజావుగా జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అధికారులు ము ందస్తుగా పరీక్ష కేంద్రాన్ని సందర్శించి, అవసరమైన అన్ని ఏర్పాట్లు సరి చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లు అనుమతించరాదని అన్నారు. పరీక్ష కేం ద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఉదయం 9:45 గ ంటలకు, మధ్యాహ్నం 2:15 తర్వాత ఎవరిని అనుమతించరాదన్నారు.

పరీక్ష కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పట్టణ శివార్లలో ఉన్న పరీక్ష కేంద్రాల సమీపంలో భోజనాల సౌకర్యం అనుమతించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థినీలను చేసేందుకు ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రూప్4 హెల్ప్ లైన్ నెంబర్ 7995 061192 జిల్లాలో గ్రూప్-4పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఏవేనీ సందేహాలు, సమస్యలు నివృత్తి చేసుకునేందుకు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు హెల్ప్ లైన్ నెంబర్ 7995061192 ను సంప్రదించవలసిందిగా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News