Monday, December 23, 2024

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -
  • జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

భూపాలపల్లి కలెక్టరేట్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీ చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా కలెక్టర్ శుక్రవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్షించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు వివిధ శాఖల ద్వారా పంపిణీ చేసే ఆస్తుల వివరాలు, ఏర్పాటుచేసే స్టాల్స్ వివరాలు అందించాలని కలెక్టర్ సూచించారు.

దశాబ్ది ఉత్సవాలు, వరదలలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులు, అధికారులకు ప్రశంసా పత్రాలు అందించాలని నిర్ణయించామని, ఇందుకు అనుగుణంగా ప్రతి కార్యాలయం నుండి ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. వేడుకలకు సంబంధించి ప్రోటోకాల్ పాటిస్తూ సీటింగ్ ఏర్పాటు చేయాలని, స్టేజ్ ఏర్పాట్లు, త్రాగునీరు సరఫరా, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాట్లను సంబంధిత శాఖ అధికారులు అంబేద్కర్ స్టేడియంలో పకడ్బందీగా నిర్వహించాలని, జిల్లా ప్రగతి సందేశమును తయారు చేయాలని, స్టాళ్లను ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులతో నృత్య ప్రదర్శనలు తెలంగాణ సాంస్క్రతిక సారథి కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వేడుకల సందర్భంగా అంబులెన్స్‌లు అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉంచాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్‌పి కరుణాకర్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి మహేష్, సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News