- Advertisement -
రాయిపూర్ : ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో ఒక మార్కెట్ వద్ద పహరాలో ఉన్న ఛత్తీస్‌గఢ్ సాయుధ దళం (సిఎఎఫ్) ఉద్యోగిని నక్సలైట్లు శనివారం హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. హతుని కంపెనీ కమాండర్ తిజౌ రామ్ భువార్యగా గుర్తించారు. ఆయన సిఎఎఫ్ బృందానికి సారథ్యం వహిస్తున్నారు. నక్సలైట్లు ఆయనపై గొడ్డలితో దాడి చేశారని పోలీసులు తెలియజేశారు. కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో శనివారం ఉదయం సుమారు 9.30 గంటలకు ఆ దాడి జరిగింది. సిఎఎఫ్ బృందాన్ని భద్రత నిమిత్తం గ్రామ సంతలో మోహరించారు. వారు గస్తీ తిరుగుతున్నారు. తిజౌ రామ్ భువార్య సిఎఎఫ్ నాలుగవ బెటాలియన్‌కు చెందినవారు. ఆ సంఘటన అనంతరం అధికారులు దుండగుల కోసం గాలింపు ప్రారంభించారు. ఆ ప్రాంతంలో పహరా కాస్తున్నారు.
- Advertisement -