Wednesday, January 8, 2025

ఖని ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణకు పకడ్బందీ చర్యలు

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత వైద్య అధికారులను ఆదేశించారు. మంగళవారం గోదావరిఖనిలో వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ముజమ్మిల్ కాన్ సందర్శించారు. జనరల్ ఆసుఫత్రిని ఆసాంతం పరిశీలించిన కలెక్టర్ రోగులతో ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, రోగులతో వచ్చే సహాయకుల సౌకర్యార్థం షెడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆసు పత్రిలో ఉన్న ప్రతి బెడ్ వద్ద రోగుల సహాయకుల కోసం ఒక కుర్చీ అందిస్తామని కలెక్టర్ తెలిపారు.

వైద్య కళాశాల నిమిత్తం నూతనంగా నిర్మించిన 85 పడకల బ్లాక్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. గోదావరిఖని ఆసుపత్రి పాంగణంలో సిసి రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి రెండు రోజుల్లో సమర్పించాలని, కలెక్టర్ టిఎస్ ఎంఐడిసి ఇంజనీర్లను ఆదేశించారు. నూతన బ్లాక్‌కు ఆక్సిజన్ సౌకర్యం కల్పన కోసం 18 లక్షల వరకు ఖర్చ వుతాయని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ తెలుపగా, ప్రతిపాదనలు సమర్పించాలని, స్థానికంగా నిధులు సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.

ఆసుపత్రిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ఆర్‌ఓ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఆసుపత్రి ప్రహారీ గోడకు రెండు గేట్లు ఏర్పాటు చేయాలని, ఆసుపత్రి ప్రాంగణంలో వాహనాల పార్కింగ్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో గోదావరిఖని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్‌సింగ్, వైద్య అధికారులు, సిబ్బంది తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News