Wednesday, January 22, 2025

మంచి దొంగలు: ఎదురు డబ్బిచ్చి పారిపోయారు( వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: దొంగల్లోనూ మానవత్వం ఉంటుందని నిరూపించారు ఆ ఇద్దరు దొంగలు. డబ్బు కోసం ఒక జంటను కత్తి చూపెట్టి ఒక బెదిరించిన ఇద్దరు దొంగలు ఆ జంట దగ్గర కేవలం 20 రూపాయలే ఉండడంతో వారి పేదరికం చూసి చలించిపోయిన ా దొంగలు తమ జేబులో నుంచి రూ. 100 తీసి వారికి ఇచ్చి వెళ్లిపోయారు ఆ. జూన్ 21వ తేదీన ఢిల్లీలోని షాదారా జిల్లాలో ఈ సంఘటన జరుగగా సిసిటివిలో రికార్డయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఇద్దరు దొంగలు చివరకు పోలీసులకు చిక్కారు.

కుమార్ అభిషేక్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ దొంగలకు కూడా మనసు ఉంటుంది అని క్యాప్షన్ పెట్టాడు. చోరీ చేద్దామనుకున్న ఆ దొంగలే ఆ జంట పరిస్థితి చూసి చేతిలో రూ. 100 పెట్టి వెళ్లిపోయారంటూ తెలియచేశాడు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భిన్న స్పందన లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News