Monday, December 23, 2024

రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం

- Advertisement -
- Advertisement -

ఎందరో మంది బిడ్డలు బలిదానాలైయ్యారు: టిడిపి నేత సామా భూపాల్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : రజాకార్ల అరాచక పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగిందని, ఎందరో మంది బిడ్డలు, బలిదానాలకు గురైయ్యారని, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామా భూపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ విమోచనదినం సందర్భంగా ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు రాజకార్లు మత పిచ్చితో బానిసత్వంలో ఉన్న వారిపై పైశాచిక ఆనందం పొందుతూ పాలన చేశారు,  వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఎందరో తెలంగాణ మహాను భావులను పొట్టన పెట్టుకున్న మూర్ఖుడు ఖాసిం రజ్వీ అని మండిపడ్డారు. సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన నల్లగొండ,వరంగల్ జిల్లాల్లోప్రాణాలను సైతం లెక్క చేయకుండా మొక్కవోని దీక్షతో సాయుధ పోరాటం జరిగిందన్నారు. వ్యవసాయం చేసే అక్కలు కొడవల్లు పట్టినారు. దుక్కి దున్నే నాగళ్లతో..పొలం పనులు చేసే రైతన్నలు చేతుల్లో తుపాకులు పట్టిన్రు, భగత్ సింగ్ లాంటి వారిని ఆదర్శగా తీసుకొని, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ప్రజలు తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేశారని పేర్కొన్నారు.

తెలంగాణ విముక్తి అయింది కానీ పేద ప్రజలు, పల్లెలు విముక్తి కాలేదు. కానీ నాడు పటెల్, పట్వారీలు బడుగువర్గాలను నిరక్షరాస్యులుగా,  నిరుపేదలను చేసి పాలన చేస్తున్న పాలనసాగించే వారని, ఆ బానిసత్వం నుంచి విముక్తి చేయడం కోసం నాడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారని పేర్కొన్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దుచేసి, గాంధీ మార్గాన్ని అనుసరించి గ్రామ స్వరాజ స్థాపనకు శ్రీకారం చుట్టారని ఎంతో మంది బడుగులకు రాజకీయ అవకాశాలు ఇచ్చి చైతన్యవంతులుగా చేశారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన పిల్లల ఎదుగుదల కోసం ఆర్ధికంగా ఎదగడం కోసం,యావత్ ప్రపంచం మెచ్చేలా తీర్చిదిద్దారు. అదే విధంగా టిడిపి హయాంలో హైటెక్ సిటీ నిర్మించి లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఐటి రంగంలో ఉన్నత ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు కృషి చేశారని తెలిపారు.

నేడు నీచ నికృష్ట పాలన చేస్తూ.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పాలన చేస్తున్న ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ పై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ తెలుగదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షుని ఆదేశాలతో చంద్రబాబు నాయుడు ఆలోచనతో రెండు తెలుగు రాష్ట్రల్లో అధికారం వచ్చేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు డా.రామనాధం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అజ్మీరా రాజు నాయక్, జక్కిలి ఐలయ్య, బిసి సెల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పతి సతీష్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పొలంపల్లి అశోక్,రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శులు రవీంద్రాచారి,మేకల బిక్షపతి ముదిరాజ్, సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు పి.సాయి బాబా,మల్కాజ్ గిరి పార్లమెంట్ అధ్యక్షుడు కందికంటి అశోక్, పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు సంజయ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News