చరిత్రలోనే ఎన్నడూ లేనింత ప్రగతి
మరో రూ. 23.75 కోట్లతో అభివృద్ధి పనులు
రూ. 2 కోట్లతో ఆర్మూర్ టూరిజం
గుండ్ల చెరువులో ఐలాండ్, బోగింగ్ పెండింగ్‌లో 365 పనులు
వాటిని త్వరగా పర్తి చేసేలా బాధ్యతలు స్వీకరించిన అధికారులు
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
ఆర్మూర్: అభివృద్ధిలో ఆర్మూర్ ఫస్ట్, చరిత్రలోనే ఎన్నడూ లేనంత ప్రగతి పనులు కొనసాగుతున్నాయని పీయూసి చైర్మన్ జీవన్‌రెడ్డి అన్నారు. ’నమస్తే నవనాథపురం’కార్యక్రమంలో భాగంగా గురువారం ఆర్మూర్ పట్టణంలో నిర్వహించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఉదయం పలు వార్డుల్లో పర్యటించిన జీవన్‌రెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో పలు ప్రజా సంఘాల పెద్దలు జీవన్‌రెడ్డిని సత్కరించారు.
జై జీవనన్న, జైజై కెసిఆర్, జై తెలంగాణ ’ నినాదాలతో ఆర్మూర్‌పట్ణణ వీధులు మారుమోగాయి. ఆయన వార్డు వార్డు కలియ తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు. ప్రతీ ఒక్కరిని పేరుపేరునా పలకరిస్తూ ప్రజల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అమ్మా బాగున్నారా అంటూ మహిళలను పలకరించారు. మీకు మిషన్ భగీరథ మంచినీళ్లు వస్తున్నాయా, నీళ్ల ట్యాంకులను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తున్నారా, పెన్షన్లు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న మహిళలతో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ మీ అందరికి పెన్షన్లు వస్తున్నాయో, ఎవరిస్తున్నారు అని ప్రశ్నించగా వస్తున్నాయని, కెసిఆర్ ఇస్తున్నారని వారు చెప్పారు.
కెసిఆర్ మీ ఇంటి పెద్ద కొడుకు అని జీవన్‌రెడ్డి అనగా మహిళలంతా అవును అంటూ చప్పట్లు కొడుతూ మీరు చిన్న కొడుకులా మమ్మల్ని చూసుకుంటున్నారని చెప్పారు. దారి పొడవునా ఎదురైన మహిళలతో ఆయన మాట్లాడి మీకుపెన్షన్లు వస్తున్నాయా? కళ్యాణ లక్ష్మి పథకం డబ్బులొస్తున్నాయా? అని అడిగారు. అనంతరం ఆర్మూర్ పట్టణ ప్రగతిపై అధికారులతో జరిగిన సమీక్షలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడే లేని విధంగా కోట్లాది రూపాయల వ్యయంతో ఆర్మూర్ పట్టణంలో సిద్దులగుట్ట ఘాట్ రోడ్డు, ఆలూరు, ఆర్టీసీ బైపాస్ రోడ్లు, అంబేద్కర్ చౌరస్తా అందాలు, డివైడర్లు, అన్ని కుల సంఘాల భవనాల నిర్మాణాలకు నిధులు, ఆర్మూర్ పట్టణమంతా రోడ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు.
మరో రూ. 23.75 కోట్ల రూపాయలు ఈరోజే మంజూరు చేయడానికి మంత్రి కెటిఆర్ హామీనిచ్చారని, ఈ నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని జీవన్‌రెడ్డి ప్రకటించారు. ’నమస్తే నవనాథపురం ’ కార్యక్రమంలో తనతో పాటు పాల్గొన్న అధికారులకు, ప్రజాప్రతినిధులకు జీవన్‌రెడ్డి ఈ సందర్భంగా కృత్ఞతలు తెలిపారు. ఈ నమస్తే నవనాథపురం కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పండిత్ వినీత పవన్,ర వైస్ చైర్మన్ మున్ను, అన్ని వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.