Monday, December 23, 2024

పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ బ్యూరో : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పంద్రాగస్టు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధికార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి, ఫారెస్ట్, పశు సంవర్ధక, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం తదితర శాఖల పనితీరును చాటేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.

ఉత్తమ ఉద్యోగుల ఎంపిక కోసం శాఖల వారీగా ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి. యాదిరెడ్డి, నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. మకరంద్, అదనపు డిసిపి జయరాం, జెడ్పి సీఈఓ గోవింద్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News