Wednesday, January 22, 2025

బిక్షం అడిగినందుకు కాలుతో తన్నిన డిప్యూటీ తహసీల్దార్… టిప్పర్ కిందపడి యాచకుడు మృతి

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: ఓ డిప్యూటీ తహసీల్దార్ యాచకుడిని కాలుతో తన్నడంతో టిప్పర్ కింద పడి అతడు మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాజశేఖర్ అనే వ్యక్తి మెండోర మండల ఆఫీస్‌లో డిప్యూటీ తహసీల్దార్‌గా పని చేస్తున్నాడు. రాజశేఖర్ ఆర్మూర్ వెళ్తున్నప్పుడు మామిడిపల్లి చౌరస్తాలో సిగ్నల్ పడడంతో కారు ఆపాడు. శివరాం(32) అనే బిచ్చగాడు కారు అద్దాలు తుడిచి డబ్బులు ఇవ్వాలని కోరాడు. అదే సమయంలో సిగ్నల్ పడడంతో కారు ముందుకు వెళ్తుండగా కారు వెనకాల అతడు పరుగులు తీశాడు. వెంటనే డిప్యూటీ తహసీల్దార్ కారులో నుంచి బయటకు దిగి కోపంతో బిచ్చగాడిని కాలుతో తన్నడంతో టిప్పర్ వెనుక చక్రాల కిందపడి చనిపోయాడు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సిసి కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. యాచకుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు, బాధితుల బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. మృతుడి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News