- Advertisement -
మయన్మార సైన్యం రమ్రీ ద్వీపంలో అరకన్ జాతి సైనికుల గుప్పిట్లో ఉన్న క్యౌంక్‌ని మావ్ గ్రామంపై బుధవారం వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 40 మంది చనిపోగా, 20 మంది గాయపడ్డారు. ఈ వివరాలను ఓ స్థానిక ఛారిటీ అధికారులు గురువారం తెలిపారు. అంతేకాక బాంబింగ్‌లో వందలాది ఇళ్లు దగ్ధం అయ్యాయని కూడా వారు తెలిపారు. ప్రస్తుతం ఆ గ్రామం పరిస్థితి ఎలా ఉందన్నది తెలియడం లేదు.
ఎందుకంటే అక్కడ ఇంటర్నెట్, సెల్‌ఫోన్ సర్వీసులు కట్ ఆఫ్ అయి ఉన్నాయి. మయన్మార్‌లో ఆంగ్‌సాన్ సూకీ ప్రభుత్వాన్ని 2021 ఫిబ్రవరిలో కూల్చేసి సైన్యం ప్రభుత్వ అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్నాక అక్కడ హింసాత్మక వాతావరణం చోటుచేసుకుంది. శాంతియుత ప్రదర్శనలను బలప్రయోగంతో అణచివేయడం మొదలెట్టగా, సైన్యానికి వ్యతిరేకులైన చాలా మంది ఆయుధాలు చేపట్టారు. మయన్మార్ ప్రస్తుతం ఘర్షణలతో అట్టుడుకుతోంది.
- Advertisement -