- Advertisement -
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్ జిల్లా మిగ్గింగ్ వద్ద శుక్రవారం సైనిక హెలికాప్టర్ ఒకటి కూలిపోయింది. సైనిక సిబ్బందితో వెళుతున్న తేలికపాటి హెలికాప్టర్ ఉదయం 10.43 గంటల ప్రాంతంలో కూలిపోయినట్లు ఒక రక్షణ అధికారి తెలిపారు. ప్రమాదం జరిగిన చోటు పర్వత ప్రాంతంలో ఉన్నందున అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టేందుకు చాలా సమయం పడుతుందని ఆయన తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లో సైనిక హెలికాప్టర్ కూలిపోవడం ఈ నెలలో ఇది రెండవసారి. అక్టోబర్ 5న తవాంగ్ జిల్లాలో ఒక చీటా హెలికాప్టర్ కూలిపోగా ఇద్దరు పైలట్లలో ఒకరు మరణించారు.
- Advertisement -