- Advertisement -
గువాహటి: అరుణాచల్ ప్రదేశ్‌లో గురువారం ఒక ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. ఇద్దరు పైలట్లు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. మిలిటరీ ఏవియేషన్‌కు చెందిన చీటా హెలికాప్టర్‌కు గురువారం ఉదయం 9.15 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయని గువాహటిలోని ఆర్మీ ప్రజా సంబంధాల అధికారి(పిఆర్‌ఓ) తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని బండిలాకు పశ్చిమాన మనదల సమీపంలో హెలికాప్టర్ కూలిపోయి ఉంటుందని అయన అనుమానం వ్యక్తం చేశారు. హెలికాప్టర్‌లోని పైలట్, కోపైలట్ కనపడడం లేదని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -