Monday, January 20, 2025

ఆర్మీ హెలికాప్టర్ కూలి పైలట్ మృతి

- Advertisement -
- Advertisement -

Army helicopter crashes in Jammu and Kashmir

శ్రీనగర్: ఉత్తర కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌లో మంచుతో కూడిన ప్రాంతంలో శుక్రవారం భారత ఆర్మీ చీతా హెలికాప్టర్ కూలిపోయింది. జమ్మూ కాశ్మీర్‌లోని గురెజ్ సెక్టార్‌లోని బరౌమ్ ప్రాంతంలో చీతా హెలికాప్టర్ కూలిపోయిందని రక్షణ అధికారి తెలిపారు. నిఘా వర్గాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. హెలికాప్టర్ సిబ్బందిని రక్షించేందుకు భద్రతా బలగాల సెర్చ్ పార్టీలు మంచు కురుస్తున్న ప్రాంతానికి చేరుకుంటున్నాయని అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్ మృతిచెందగా, మరో పైలట్ కు తీవ్ర గాయాలయ్యాయి. అస్వస్థతతో ఉన్న బిఎస్ఎఫ్ సిబ్బందిని తీసుకువెళ్లేందుకు ఛాపర్ వెళ్తోందన్నట్టు సమాచారం. భద్రతా బలగాలు ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News