Wednesday, January 22, 2025

కశ్మీరులో కూలిపోయిన ఆర్మీ హెలికాప్టర్

- Advertisement -
- Advertisement -
Army helicopter crashes in Kashmir
పైలట్ మృతి.. కో పైలట్ పరిస్థితి విషమం

శ్రీనగర్: అనారోగ్యంతో ఉన్న బిఎస్‌ఎఫ్ జవాన్లను తరలించడానికి వెళుతున్న ఒక సైనిక హెలికాప్టర్ ఉత్తర కశ్మీరులోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఓసి) సమీపంలో కూలిపోవడంతో పైలట్ మరణించగా సహపైలట్ గాయపడ్డారు. ఈ దుర్ఘటన గురేజ్ సెక్టార్‌లో శుక్రవారం సంభవించింది. గాయపడిన సహపైలట్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వారు చెప్పారు. హైలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు పైలట్లు ఆర్మీ ఏవియేషన్ కోర్‌కు చెందిన మేజర్ ర్యాంకు సైనికులని అధికారులు చెప్పారు. ల్యాండ్ అవుతుండగా వాతావరణం సహకరించకపోవడంతో హెలికాప్టర్ కూలిపోయిందని అధికారులు చెప్పారు. బండిపొర జిల్లాలోని గుజ్రన్ నల్లా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు వారు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News