Thursday, November 14, 2024

రూ.2.5 కోట్లు ఇస్తే ఈవీఎంను మార్చేస్తా.. నిందితుడు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

పుణె : రూ.2.5 కోట్లు ఇస్తే ఈవీఎంను మార్చేస్తానని మోసగించేందుకు ప్రయత్నించిన ఓ జవానును రాజకీయ నేత ఒకరు చాకచక్యంగా వ్యవహరించి పోలీస్‌లకు పట్టించాడు. మహారాష్ట్ర లోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సైన్యంలో పనిచేస్తున్నమారుతి థక్నే అనే వ్యక్తి ఇటీవల పుణెలో మహారాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నేత శివసేన (యూబీటీ ) నాయకుడు అంబాదాస్ దన్వేను కలిశాడు. నిర్దిష్ట అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చేలా చిప్‌ను ఉపయోగించి ఈవీఎంను మారుస్తానని, అందుకు తనకు రూ.2.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో దన్వే పోలీస్‌లకు సమాచారం ఇచ్చాడు.

నిందితుని ఆధారాలతో పట్టించేందుకు పక్కా వ్యూహం అమలు చేశారు. మంగళవారం సాయంత్రం దన్వే సోదరుడు రాజేంద్ర , నిందితుడిని ఓ హోటల్‌కు పిలిపించాడు. అక్కడ రూ.1.5 కోట్లకు డీల్ పూర్తి చేసుకున్నట్టు అతడిని నమ్మించి టోకెన్ కింద రూ. లక్ష ఇచ్చాడు. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీస్‌లు నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. “ నిందితుడికి భారీ మొత్తంలో అప్పులు ఉన్నాయి. వాటిని తీర్చేందుకు ఇలా అడ్డదారిలో మోసాలకు ప్రయత్నించాడు. అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నాం” అని పోలీస్‌లు వెల్లడించారు. అహ్మద్ నగర్ జిల్లాకు చెందిన మారుతి ధక్నే , జమ్ముకశ్మీర్ లోని ఉదంపూర్ ప్రాంతంలోఆర్మీ బేస్‌లో విధులు నిర్వర్తిస్తున్నట్టు పోలీస్‌లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News