Monday, December 23, 2024

ఉరివేసుకుని ఆర్మీ జవాన్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉరివేసుకుని ఓ ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజీందర్ లంగర్‌హౌస్‌లోని ఆర్మీ సెంటర్‌లో హవల్దార్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున తన రూములో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జవాన్ ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న లంగర్‌హౌస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News