Thursday, January 23, 2025

అత్యాచారం కేసు… సాక్షిని కాల్చి చంపిన జవాన్

- Advertisement -
- Advertisement -

Why Guns Rifles Are Entering Stray in America

నాగ్‌పూర్: సోదరుడి అత్యాచారం కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తి జవాన్ తుపాకీతో కాల్చి చంపిన సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భారత్ రామచంద్ర కాంబ్లే అనే జవాన్ ప్రస్తుతం లడఖ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. రామచంద్రకు ప్రేమ్‌లాల్ అనే సోదరుడు ఉన్నాడు. 2021లో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ప్రేమ్‌లాల్ అరెస్టు అయ్యారు. ఈ అత్యాచారం కేసులో కేశవ్ బాబురావు మస్కే అనే వ్యక్తి నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. భారత్ రామచంద్ర కాంబ్లే సెలవులు తీసుకొని తన సొంతూరుకు వస్తుండేవాడు. తన సోదరుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు బాబురావుపై కాంబ్లే పగ పెంచుకున్నాడు.  బాబురావుపై కాంబ్లే దాడి చేయడంతో పాటు తుపాకీతో తలపై కాల్చాడు. వెంటనే ఘటనా స్థలం నుంచి అతడు పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాంబ్లేని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News