తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1326 పోస్టులు: తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) 1326 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టరేట్‌లో) 751
ట్యూటర్లు (మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌లో)357
సివల్ అసిస్టెంట్ సర్జన్లుజనరల్/జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు (టీవీవీపీ)211
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో)07
అర్హత: ఎంబీబీఎస్/తత్సమాన ఉత్తీర్ణత. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 18 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: మొత్తం ప్రక్రియ 100 పాయింట్లకు ఉంటుంది. అర్హత పరీక్షలో ఎంబీబీఎస్‌లో సాధించిన మెరిట్ మార్కులకు 80 పాయింట్లు కేటాయిస్తారు. మిగిలిన 20 పాయింట్లకు రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో /సంస్థల్లో/ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పని చేసిన అనుభవం ఆధారంగా ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ప్రారంభ తేది: జులై 15,2022
చివరితేది: ఆగస్టు 14,2022.
వెబ్‌సైట్: https://mhsrb.telangana.gov.in
ఎస్‌ఈసీఆర్, బిలాస్‌పూర్‌లో 465 పోస్టులు:
బిలాస్‌పూర్ ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఎన్‌ఈసీఆర్).. వివిధ ట్రేడుల్లో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య- 465
ట్రేడులు : డ్రాఫ్ట్‌మెన్ (సివిల్), ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, ఫైర్‌మెన్ …
అర్హత: 10+2 విధానంలో పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటిఐ ఉత్తీర్ణలవ్వాలి.
వయసు: జులై 1,2022 నాటికి 1524 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: పదోతరగతి, ఐటిఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా..
చివరితేది: 22.06.2022
వెబ్‌సైట్: https://secr.indianrailways.gov.in
బిఎస్‌ఎఫ్, న్యూఢిల్లీలో 110 ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులు:
న్యూఢిల్లీలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు: సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) 22, కానిస్టేబుల్ 88.
విభాగాలు: వెహికల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్, స్టోర్ కీపర్.
అర్హత: సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: ౩౦ ఏళ్లకు మించకుండా ఉండాలి.
కానిస్టేబుల్ విభాగాలు: ఆటో ఎలక్ట్రిక్, వెహికల్ మెకానిక్, వెల్టర్, టర్నర్, పెయింటర్ ..
అర్హత: పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటిఐ ఉ్తత్తీర్ణలవ్వాలి/సంబంధిత ట్రేడుల్లో అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
చివరితేది: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేది నుంచి ౩౦ రోజుల్లోపు దరకాస్తు చేయాలి.
వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in
టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లో 201 సబ్ ఇంజినీర్లు
హైదరాబాద్‌లోని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఈ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సబ్ ఇంజినీర్లు (ఎలక్ట్రికల్)
మొత్తం ఖాళీలు: 201
అర్హత: డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్)/డిప్లొమా (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్)/గ్రాడ్యుయేషన్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్)/గ్రాడ్యుయేషన్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్)ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపికవిధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: ఈ పరీక్షని మల్టిపుల్ ఛాయిస్ విధానంలో మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. సెక్షన్ ఏలో మొత్తం 80 ప్రశ్నలు కోర్ టెక్నికల్ సబ్జెక్టు మీద ఉంటాయి. సెక్షన్ బి నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, హిస్టరీ, తెలంగాణ సంస్కృతి, ఉద్యమం నుంచి ఉంటాయి. పరీక్షా సమయం 2 గంటలు.
దరఖాస్తు: ఆన్‌లైన్ లో..
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.06.2022
దరఖాస్తులకు చివరితేది: జూలై 5,2022.
హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే తేది: 23.7.2022.
పరీక్షతేది: 31.07.2022.
వెబ్‌సైట్: https://www.tssouthernpower.com