- Advertisement -
ఛండీఘడ్: లెఫ్ట్‌నెంట్ కల్నల్ తన భార్యను చంపి అనంతరం గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజాబ్ రాష్ట్రం ఫిరోజ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. లెఫ్ట్‌నెంట్ కల్నల్, ఆయన భార్యకు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. దంపతులు కౌన్సిలింగ్‌కు వెళ్తున్నారు. లెప్ట్‌నెంట్ కల్నల్ తన భార్యను చంపి అనంతరం ఎకె 47 తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్‌లో తన భార్యను చంపేశానని ఒప్పుకున్నాడు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం రాంబన్ జిల్లాలో డిసెంబర్ 2021లో ఓ ఆర్మీ మేజర్ ఎకె47 తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున విషయం తెలిసిందే.
- Advertisement -