Friday, December 20, 2024

అధికార లాంఛనాలతో జవాన్ అనిల్ అంత్యక్రియలు

- Advertisement -
- Advertisement -

బోయినిపల్లి : జమ్ము కాశ్వీర్‌లోని కిష్టార్ జిల్లాలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన పబ్బాల అనిల్ మృతదేహం సైనిక లాంఛనాల మధ్య రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినిపల్లి మండలం మల్కాపూర్‌కు చేరుకుంది. మార్గమధ్యలో గంగాధర వద్ద ఆయనకు ప్రజలు ఘన నివాళులు అర్పించారు. గంగాధర నుండి మల్కాపూర్‌కు భారీ జనసందోహం మద్య యాత్ర కొనసాగింది. ఇండియన్ ఆర్మీకి చెందిన తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో కిష్టార్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో టెక్నిషియన్ అనిల్ మృతి చెందగా, ఇద్దరు పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు.

అనిల్ ఆర్మీలో గత 11 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. అనిల్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనిల్ గత 15 రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. కుటుంబ సభ్యులతో, ఊరి వారితో సరదాగా గడిపి వెళ్లి, ఈ మధ్యే విధుల్లో చేరాడు. కొన్ని రోజులకే ప్రమాదవశాత్తు ఈ దుర్ఘటన జరిగి మృతి చెందాడు. అనిల్ మృతి వార్త విని అటు కుటుంబ సభ్యులతో పాటు మొత్తం గ్రామ ప్రజలంతా కన్నీరు పెట్టుకున్నారు. అనిల్ మృతదేహానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్, అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్ పుష్పగుఛ్చం ఉంచి నివాళి అర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News