- Advertisement -
మణిపూర్‌లోని తన ఇంట్లో ఒక సైనికాధికారి అపహరణకు గురయ్యారు. గత ఏడాది మేలో రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణలు ప్రారంభమైన నాటి నుంచి ఈ తరహా ఘటన జరగడం ఇది నాలుగవసారని శుక్రవారం వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చౌబల్ జిల్లాలోని తన ఇంట్లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్(జెసిఓ) కొన్సమ్ ఖేడా సింగ్‌ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు వర్గాలు తెలిపాయి. జెసిఓని రక్షించేందుకు భద్రతా బలగాలన్నీ సమన్యవంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు. జాతీయ రహదారి 102పై నడిచే అన్ని వాహనాలను తణికీ చేస్తున్నట్లు వారు తెలిపారు. ఆయనను ఎందుకు కిడ్నాప్ చేశారో తమకు తెలియడం లేదని, ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టామని భద్రతా సంస్థలోని వర్గాలు తెలిపాయి.
- Advertisement -