Saturday, November 23, 2024

కశ్మీరులో ఉగ్రవాదుల కాల్పులలో సైనిక జెసిఓ మృతి

- Advertisement -
- Advertisement -

భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఉగ్రవాది హతం

2 Drone attack in Kaluchak Military Camp

జమ్మూ: జమ్మూ కశ్మీరులోని రాజౌరి జిల్లాల గురువారం ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల పోరులో సైన్యానికి చెందిన ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ మరణించారు. భద్రతా దళాల కాల్పులలో ఒక ఉగ్రవాది కూడా మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా సిబ్బంది తానామండి ప్రాంతంలో గాలింపు చేపట్టగా ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపినట్లు అధికారులు చెప్పారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపినట్లు వారు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పులలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఒక జెసిఓకు గాయాలయ్యాయని, వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆయన మరణించారని జమ్మూలోని రక్షణ శాఖ పిఆర్‌ఓ లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News