Friday, January 10, 2025

లాంగ్‌డ్రైవ్‌కు తీసుకెళ్లి ప్రియురాలిని చంపిన లెప్టినెంట్ కల్నల్

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో ఆమెను లెప్టినెంట్ కల్నల్ సుత్తితో కొట్టి హత్య చేసిన సంఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. డెహ్రాడూన్ లో లెప్టినెంట్ కల్నల్ రామెందూ ఉపాధ్యాయ్  విధులు నిర్వహిస్తున్నాడు. ఈ మధ్యనే సిలిగురి నుంచి డెహ్రాడూన్ బదిలీ అయ్యాడు. డెహ్రాడూన్‌లోని ఓ డ్యాన్స్ బార్‌లో శ్రేయ శర్మ(30) అనే యువతిని రామెందూ పరిచయం చేసుకున్నాడు. రామెందు తన పెళ్లి విషయాన్ని దాచిపెట్టి ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె పలుమార్లు పెళ్లి చేసుకోవాలని కోరింది. ఇద్దరు కలిసి క్లెమెంట్ టౌన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు.

Also Read: హైదరాబాద్‌ హోటల్ లో పెరుగు అడిగినందుకు చంపేశారు….

అక్కడి నుంచి ఆమెను లాంగ్ డ్రైవ్ కోసం బయటకు తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన తరువాత ఆమె తలపై లెప్టినెంట్ కల్నల్ సుత్తితో పలుమార్లు బాదాడు. ఆమె చనిపోయిందని నిర్దారించుకున్న తరువాత అక్కడి నుంచి పారిపోయాడు. ఎస్‌పి సరితా దోభల్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. లెప్టినెంట్ కల్నల్‌ రామెందును అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. తన ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే తాను హత్య చేశానని ఒప్పుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News