Friday, January 10, 2025

భార్యను హత్యచేసి సైనికాధికారి ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

ఫిరోజ్‌పూర్: ఫిరోజ్‌పూర్‌లో సైనికాధికారి ఒకరు తన భార్యను కాల్చి చంపారని పోలీసులు సోమవారం తెలిపారు. హత్య అనంతరం ఆర్మీ అధికారికి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. సైనికాధికారి అధికారిక నివాసంలో ఆదివారం రాత్రి ఇరువురు విగత జీవులుగా పడి ఉండటాన్ని గుర్తించామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

ఈ సందర్భంగా కంటోన్మెంట్ ఇన్‌స్పెక్టర్ నవీన్‌కుమార్ మాట్లాడుతూ మృతులను లెఫ్టినెంట్ కల్నల్ నిషాంత్, ఆయన భార్య డింపుల్‌గా గుర్తించామని వివరించారు. ఆదివారం రాత్రి 9గంటల సమయంలో ఇరువురి మధ్య జరిగిన వివాదం విషాదాంతంగా మారిందన్నారు. దంపతుల మధ్య విభేదాలు ఉండటంతో కౌన్సెలింగ్‌కు హాజరవుతున్నట్లు దర్యాప్తులో తేలింది. భార్యను హత్యచేసిన అనంతరం నిషాంత్ సూసైడ్ లేక రాసి ఆత్మహత్య చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఆర్మీ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News