Monday, December 23, 2024

పేలిన గ్రేనేడ్… ఇద్దరు ఆర్మీ ఆఫీసర్లు మృతి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాష్ట్రం ఫూంచ్ జిల్లాలో సోమవారం ఉదయం పేలుడు సంభవించింది. గ్రేనేడ్ పేలి ఇద్దరు ఆర్మీ ఆఫీసర్లు దుర్మరణం చెందారు. మెందార్ సెక్లార్ లో గ్రేనేడ్ పరీక్షలు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా పేలిపోవడంతో కెప్టెన్ ఆనంద్, జెసిఒ ఎన్ బి సబ్ భగవాన్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఉధమ్ పూర్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆనంద్ స్వస్థలం బీహార్ లోని భగల్ పూర్ జిల్లా ఛంపానగర్ ప్రాంతంకాగా భగవాన్ సింగ్ స్వస్థలం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అంబేద్కర్ నగర్ ప్రాంతం పోఖార్ భిట్టా గ్రామమని ఆర్మీ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News