మన తెలంగాణ / హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల అభ్యర్థుల కోసం నవంబర్ 15 నుండి 29 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. చెన్నై లోరి రిక్రూట్‌మెంట్ ఆఫీస్ (హెడ్ క్వార్టర్స్) అగ్నివీర్ (పురుషులు), అగ్నివీర్ (మహిళా మిలిటరీ పోలీస్), సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్ (వెటర్నరీ), జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (రిలీజియస్ టీచర్) అభ్యర్థులను నమోదు చేసుకోడానికి రిక్రూట్‌మెంట్ ర్యాలీలు నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ర్యాలీలకు అర్హత ప్రమాణాలతో సంబంధిత దరఖాస్తులను www.joinindianarmy.nic.in లో అప్‌లోడ్ చేయాలని, ఫార్మెట్‌ను నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా ధృవీకరణ పత్రాలను సంబంధిత రిక్రూట్‌మెంట్ ర్యాలీకి తీసుకురావాలని సూచించారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తిగా ఆటోమెటెడ్, ఫెయిర్, పారదర్శకంగా ఉంటుందన్నారు. ఉత్తీర్ణత సాధించడానికి, నమోదు చేసుకోడానికి సహాయం చేస్తామని ఎవరైనా మోసగాళ్లు చెప్పినైట్లేతే మోసపోవద్దని అలాంటి వారి నుండి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.