Monday, December 23, 2024

కొండ చీలిక‌ల మ‌ధ్య చిక్కుకున్న యువ‌కుడిని ర‌క్షించిన ఆర్మీ

- Advertisement -
- Advertisement -

Army rescues young man trapped between cliffs

పాల‌క్కాడ్‌: కొండ చీలిక‌ల మ‌ధ్య చిక్కుకున్న 23 ఏళ్ల కేర‌ళ యువ‌కుడిని ఆర్మీ ర‌క్షించింది. ఇవాళ ఉద‌యం పాల‌క్కాడ్ జిల్లాలో మ‌ల‌పుజా వ‌ద్ద ఉన్న కురుంబాచి కొండ చీలిక‌లో చిక్కుకున్న యువ‌కుడిని ర‌క్షించేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. ముందుగా ఆ కుర్రాడికి ఆహారం, నీటిని ఆర్మీ అందించింది. దాదాపు 43 గంట‌లుగా ఆర్‌.బాబు అనే యువ‌కుడు ఆ కొండ చీలిక‌లోనే ఉన్నాడు. ముగ్గురు స్నేహితులతో క‌లిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన బాబు.. ఆ కొండ‌ను దిగే స‌మ‌యంలో అల‌సిపోయి కాలుజారి ప‌డ్డాడు. అయితే కింద‌ప‌డే క్ర‌మంలో అత‌ను ఆ కొండ‌ల్లో ఉన్న చీలిక ప్ర‌దేశంలో చిక్కుకున్నాడు. అత‌ని మిత్రులు కాపాడే ప్ర‌య‌త్నం చేసినా.. బాబును వాళ్లు ర‌క్షించ‌లేక‌పోయారు. ఇవాళ ఆర్మీ రంగ ప్ర‌వేశంతో బాబు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News