- Advertisement -
హైదరాబాద్: సెలవుపై మణిపూర్‌లోని తన ఇంటికి వచ్చిన సైనికుడిని కిడ్నాప్ చేసి చంపేశారు. సైన్యంలో జవానుగా ఉన్న సిపాయి సెర్టో థంగ్‌థంగ్ కోమ్ సెలవుపై ఇటీవలే తన స్వగ్రామం ఇంఫాల్ జిల్లాలోని తన గ్రామానికి వచ్చాడు. కాగా కొందరు సాయుధులు శనివారం ఆయన ఇంటికివచ్చి తలకు తుపాకీ గురిపెట్టి , ఓ తెల్లటి వాహనంలో తీసుకువెళ్లినట్లు ఆయన కుమారుడు పోలీసులకు తెలిపాడు. రోజంతా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఆదివారం ఈ సిపాయి మృతదేహం కునింగెతెక్ గ్రామం వద్ద పడి ఉండగా గుర్తించారు. ఆయన తలకు గురిపెట్టి ఒకే ఒక్క బుల్లెట్‌తో కాల్చి చంపినట్లు నిర్థారణ అయింది. సాయుధుల చేతిలో బలయిన సైనికుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. జవాను దారుణ హత్యను సైన్యం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటనలో తెలిపింది.
- Advertisement -