హైదరాబాద్: పంజాబ్‌లోని పాటియాలా సమీపంలోని భాక్రా కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయిన మహిళను ఓ ఆర్మీ జవాన్ వీరోచితంగా రక్షించాడు. సంఘటన సమయంలో కాలువ నీటిమట్టం ఎక్కువగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పర్యాటకురాలు కాలు తప్పి కాలువలో పడిపోవడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు.
వేగంగా స్పందించిన ఆర్మీ జవాన్ డీఎన్ కృష్ణన్ నీటిలో మునిగిపోతున్న మహిళను రక్షించే ప్రయత్నంలో కాలువలోకి దూకాడు. అయితే, బలమైన నీటి ప్రవాహం కారణంగా, అతను ఆమెను చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. పరిస్థితి అత్యవసరమని గుర్తించిన స్థానికులు రెస్క్యూ ఆపరేషన్‌లో సహకరించి తాళ్లు విసిరారు. వారి సమష్టి కృషితో జవాన్ మహిళను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రెస్క్యూ ఆపరేషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జవాన్ ధైర్యసాహసాలకు వీక్షకుల నుండి ప్రశంసలు వచ్చాయి. జవాన్ సాహసోపేతమైన చర్యను స్థానికులు పోలీసులు కూడా ప్రశంసించారు.
#WATCH | Indian Army soldier, Sepoy DN Krishnan jumped into the ferocious Bhakra Canal near Patiala, Punjab & rescued a drowning teenage girl who had fallen in the canal: PRO Defence Chandigarh
(Video source: PRO Defence Chandigarh) pic.twitter.com/eJWZPSDbrm
— ANI (@ANI) June 18, 2023