Monday, December 23, 2024

సైన్యం కుదింపు?

- Advertisement -
- Advertisement -

Army strength will be reduced in next two years

కనీసం 2లక్షల మందిని తగ్గించాలని కేంద్రం
నిర్ణయం? ఆధునికీకరణ ప్రక్రియ పేరిట
భారీ కోత 10.8లక్షలకు తగ్గనున్న సైన్యం

న్యూఢిల్లీ : వచ్చే రెండేళ్లలో సైన్యం బలగం తగ్గనుంది. అప్పటికీ రెండు లక్షల మంది సైనికులను తగ్గించాలని, కశ్మీర్‌లో బలగాన్ని పునర్వస్థీకరించాలని యోచిస్తోంది. ఇప్పటికే సైన్యంలో దాదాపు 1.35 లక్షల సి బ్బంది కొరత ఉంది. అయితే దీనిని పరిగణనలోకి తీసుకోకుండా ఇప్పుడున్న 12.8 లక్షల మంది సైనిక బలగాన్ని వచ్చే రెండేళ్లలో 10.8 లక్షలకు కుదించాలని రక్షణ, భద్రతా విభాగ వర్గాలు మీడియాకు అనధికారికంగా తెలిపాయి. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక విభాగాల సైనిక సిబ్బంది, రాష్ట్రీయ రైఫిల్స్‌ను ఇప్పుడున్న స్థానాలనుంచి వేరే చోటికి తరలిస్తారు. ఈ విధంగా జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాల ఏ ర్పాట్లలో భారీ స్థాయి మార్పులు ఉంటాయి. ఇప్పటి వరకూ తిష్ట వేసుకుని ఉన్న ప్రాంతాల నుంచి కొన్ని బలగాలను అత్యవసరం అయిన ప్రాంతాలకు తరలిస్తారు. సైన్యం కుదింపు ఇతర విషయాలకు ఏదైనా కాలపరిమితి విధించుకున్నారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ సైనిక బలగా ల సంఖ్యను ఎప్పటికప్పుడు హేతుబద్థీకరించుకోవడం జరుగుతుం ది. ఈ విషయంలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవల్సి ఉం టుంది.

ఆర్మీలో గత రెండేళ్లుగా రిక్రూట్‌మెంట్లు లేవు. దీనితో సిబ్బంది కొరత ఉంది. అగ్నిపథ్ స్కీంను ప్రారంభించినా దీని ద్వారా ఈ ఏడాది కేవలం 35000 నుంచి 40000 మందినే సైన్యంలోకి అగ్నివీరులుగా తీసుకుంటారు. ప్రతి ఏటా సగటున దాదాపు 60000 మంది సిబ్బంది రిటైరవుతారు. ఈ విధంగా ఏర్పడే ఖాళీలను అగ్నిపథ్ ద్వారా జరిగే నియామకాలతో భర్తీ చేయడం నామమాత్రం అవుతుంది. ఎన్‌సిసి, రెజిమెంటల్ హెడ్‌క్వార్టర్లకు డిప్యూటేషన్లను గణనీయంగా తగ్గిస్తారు. ముం దుగా ప్రధానంగా ఆర్మీ హెడ్‌క్వార్టర్‌లో సిబ్బంది సంఖ్య తగ్గుతుంది. మనోహర్ పర్రికర్ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు నియమించిన షెట్కార్ కమిటీ 2016 డిసెంబర్‌లో నివేదిక ఇచ్చింది. ఇందులో పలు మార్పు లు సూచించింది. బలగాలను తగ్గించుకోవచ్చునని, అయితే అధునాతనం , సమన్వయం పెంచేలా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. దీని కి అనుగుణంగానే ఇప్పుడు సైన్యంలో మార్పులు చేపట్టినట్లు వెల్లడైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News