Tuesday, December 24, 2024

కుప్పకూలిన శిక్షణ హెలికాప్టర్

- Advertisement -
- Advertisement -

Army trainer aircraft crashes near gaya

 

గయ : ఆర్మీ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. బీహార్‌లోని బోధ్ గయా బ్లాక్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్‌లో భాగంగా ఇద్దరికి ఎయిర్‌క్రాఫ్ట్‌లో శిక్షణ నిస్తుంది. దీనిలో భాగంగా వీరు ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ గయా సమీపంలో కుప్పకూలింది. ట్రైనీ ఉద్యోగులు హెలికాప్టర్ టెకాఫ్‌కు ప్రయత్నించిన కొద్ది నిమిషాల్లోనే ప్రమాదం జరిగింది.ఈ క్రమంలో హెలికాప్టర్ అక్కడే ఉన్న పొలాల్లో దూసుకుపోయిందని సీనియర్ అధికారి తెలిపారు. హెలికాప్టర్ కిందపడటాన్ని చూసిన గ్రామస్థులు వెంటనే సంఘటన స్థలానికి పరుగున చేరుకున్నారు. హెలికాప్టర్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ట్రైనీలకు చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయని ఆర్మీ సిబ్బంది తెలిపారు. హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలపై విచారణ చేపట్టామని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News