Wednesday, January 22, 2025

భారత్-చైనా సరిహద్దులో విషాదం.. 16 మంది జవాన్లు మృతి

- Advertisement -
- Advertisement -

భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. చాటేన్ నుంచి తంగూకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. సిక్కింలో శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదంలో ఆర్మీ బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 16 మంది భారత జవాన్లు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 13 మంది జవాన్లు, ముగ్గురు ఆర్మీ అధికారులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో పలువురు ఆర్మీ జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు 16 మంది మృతిచెందినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నార్త్ సిక్కింలోని జైమా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News